మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మాట్లాడడం ఒక ముఖ్యమైన సామాజికాంశమని ముక్కు, వూపిరితిత్తులు, సప్తపథ, నాలుక, పళ్లు, దవడలు, పెదాలు, అంగిటి లాంటి అనేక భాగాల సమన్వయంతో చేసే శబ్దాన్ని వినలేకపోతేే వాటి సాయంతో పలకగలిగే శక్తిరాదని అయితే బధిరులకు బాసటగా జగనన్న ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం దగ్గర జరిగిన ఉచిత వైద్య శిబిరం వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో ఒక్క క్షణంలో కలిసిపోయే మంత్రి పేర్ని నాని తన కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ముస్లిం సోదరీ సోదరీమణులతో ఉర్దూ భాషలో అనర్గళంగా మాట్లాడే ఆయన బధిరుల సైగల భాషను ఎంతో చక్కగా నేర్చుకొని వారి మనసులను దోచుకొనేలా సంజ్ఞలు చేయడం మంత్రి పేర్ని నాని ప్రత్యేకత. అక్కడకు వచ్చిన చెవిటి, మూగ దివ్యాంగులతో మంత్రి పేర్ని నాని వారి సంజ్ఞల భాషలో వారికి అర్థమయ్యేలా చక్కగా సంభాషించారు.
తన చుట్టుపక్కల ఉన్న సమాజపు, కుటుంబపు, పరిసరాల్లో జరిగే సంభాషణలను వింటూ ఆ వ్యక్తుల ముఖకవళికలను చూడ్డం ద్వారా ప్రతి మనిషి భాష నేర్చుకుంటాడని, మాటలు బాగా నేర్చుకున్నాక పెద్దయ్యాక, ఏదైనా ప్రమాదవశాత్తూ చెవుడు వస్తే వారేమీ క్రమంగా మూగ వారు కారని చెప్పారు. కేవలం పుట్టుకతోనూ లేదా మాటలు రాని వయసులోనూ చెవుడు వస్తే వారు మూగవారయ్యే అవకాశాలు ఎక్కువని మంత్రి అన్నారు. తెలుగు మాత్రమే మాట్లాడే తల్లిదండ్రులు ఆ బిడ్డ పుట్టిన కొన్ని నెలలకే ఒరిస్సా వెళ్లి ఒరియా భాష మాత్రమే మాట్లాడే పరిసరాల్లో పెంచితే ఆ బిడ్డ క్రమేపీ ఆ ఒరియా భాషనే మాట్లాడేలా ఎదుగుతాడని కానీ చెవుడు ఉన్న బిడ్డ తన చుట్టూ ఉన్న శబ్దాలను, భాషను వినలేడని కాబట్టి ఏ విధంగా తన నోటిలోని శబ్ద వ్యవస్థను కదిలిస్తే ఎలాంటి శబ్దాలు పుడతాయో తెలసుకోలేడన్నారు. కాబట్టి ఏ భాషా రాని అతి సులువైన శబ్దం ‘బ’ ‘బ’ ‘బ’ శబ్దాలు మాత్రమే చేయగలడని మంత్రి అన్నారు. వివరించారు. జిల్లా వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ డిగ్రీ చదువుకొంటున్న చెవిటి, మూగ దివ్యాంగులకు ల్యాప్ టాప్ లను సైతం ఇవ్వనున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
Tags machilipatnam
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …