విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సింగ్ నగర్ నూజివీడు రోడ్ లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించి సిబ్బంది హాజరు, ఇంటింటి నుండి తడి పొడి చెత్త సేకరణపై శానిటరీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. బి.ఆర్.టి.ఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ నందలి జి.ఎస్.శాస్త్రి పార్క్ ను సందర్శించారు. పార్క్ నందలి వాకింగ్ ట్రాక్, గ్రీనరిని పరిశీలించి పార్క్ నందలి వాకర్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను స్థానికులను అడిగితెలుసుకొన్నారు. పార్క్ ఆవరణ యందు ఆకులు చెత్త ఉండుట గమనించి మెరుగైన పారిశుధ్య నిర్వహణ అవలoబిoచి పార్క్ ఆవరణ ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …