-అధికారులకు సీఎం వైయస్.జగన్ ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రఖ్యాత గేయ రచయిత సీహెచ్.సీతారామశాస్త్రి (సిరివెన్నెల) కుటుంబానికి అండగా నిలవాలని సీఎం వైయస్,జగన్ ఆదేశించారు. సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడామన్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షించామని అధికారులు వివరించారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆకుటుంబంపై పడకుండా చూడాలని సీఎంగారు ఇచ్చిన ఆదేశాలమేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని సీఎంకు అధికారులు వెల్లడించారు. సిరివెన్నెల కుటుంబానికి ఒక స్థలాన్ని ఇచ్చేలా పరిశీలన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.