Breaking News

సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవండి…

-అధికారులకు సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రఖ్యాత గేయ రచయిత సీహెచ్‌.సీతారామశాస్త్రి (సిరివెన్నెల) కుటుంబానికి అండగా నిలవాలని సీఎం వైయస్,జగన్‌ ఆదేశించారు. సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడామన్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షించామని అధికారులు వివరించారు. ఆస్పత్రి ఖర్చుల భారం ఆకుటుంబంపై పడకుండా చూడాలని సీఎంగారు ఇచ్చిన ఆదేశాలమేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని సీఎంకు అధికారులు వెల్లడించారు. సిరివెన్నెల కుటుంబానికి ఒక స్థలాన్ని ఇచ్చేలా పరిశీలన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *