తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకమని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ ) డా. కె. మాధవీలత అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయం ఆవరణలో జగనన్న పాలవెల్లువ పధకం గ్రామ డైరీ సంఘ కార్యదర్సులు, ప్రమోటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకాన్ని జిల్లాలో త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించనున్నారన్నారు. ప్రైవేట్ డైరీల కన్నా వెన్న శాతం కొలవడంలో అమూల్ సంస్థ ఖచ్చితత్వాన్ని పాటిస్తున్నదన్నారు. దీనివల్ల రైతులు లీటరుకు 5 నుండి 7 రూపాయలకు పైగా లాభాన్ని పొందుతారన్నారు. జగనన్న పాలవెల్లువ వలన కలిగే ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేసి ఈ పధకం విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ పధకం అమలుకు జిల్లాలో 303 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, ఆయా గ్రామాలలోని రైతు భరోసా కేంద్రం పరిధిలో గ్రామ డైరీ సంఘాన్ని ఏర్పాటు చేసి, ఒకొక్క సంఘంలో 11 మంది ప్రమోటర్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పాల సేకరణ నిర్వహణకు అదే గ్రామంలోని వారిని సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రెటరీలుగా నియమించడం జరుగుతుందన్నారు. పాల సేకరణ సక్రమంగా చేసేందుకు సంఘానికి 2 లక్షల విలువైన కంప్యూటర్లు, వెన్నశాతం కొలిచే యంత్రాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ పధకం అమలుపై ప్రతీ గ్రామంలోనూ పాడి రైతులు, ప్రమోటర్లు, కార్యదర్శి, సహాయ కార్యదర్సులకు శిక్షణ కార్యక్రమములు నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలియజేసారు.
అనంతరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి , ధాన్యం కొనుగోలు ను పరిశీలించారు. తేమను కొలిచే యంత్రాలు, తూకాలను పరిశీలించారు. అనంతరం పాత తిరువూరు 1 మరియు లక్ష్మీపురం గ్రామ సచివాలయం లను సందర్శించి రికార్డులు తనిఖీ చేసారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గురించిన సమాచారాన్ని ప్రతీ సచివాలయంలో ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ధిదారుల వివరాలను, అనర్హుల వివరాలను కూడా నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ వెంట తహసీల్దార్ నరసింహారావు, ఇంచార్జి ఎంపిడిఓ పిచ్చిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags tiruvuru
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …