కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యానికి గురియై ఆసుపత్రులలో చికిత్స తీసుకుని వైద్యం నిమిత్తం అప్పులు చేసిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాను కల్పిస్తుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డిఎన్ ఆర్ బాధితులకు అందజేశారు. కైకలూరు నియోజకవర్గంలో జయమంగళ శ్రీ లక్ష్మి శ్రావణి (కొవ్వాడలంక ) రూ.1.40.000/- లు, కొప్పాక సత్య శ్రీనివాస్ (కైకలూరు)రూ.1.20.000/-లు, చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకున్న ఇద్దరు బాధితులకు ఇటీవల చెక్కులు రావడం జరిగింద న్నారు. పేద ప్రజల ఆరోగ్యానికి భద్రతను కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ లో 2465 రకాల ట్రీట్మెంట్ లు ప్రవేశపెట్టారన్నారు. ముందుగానే మీరు వెళ్లిన హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ ద్వారా నమోదు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వైస్ ఎంపీపీ మహ్మద్ జహీర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, చేరుకువాడ బాలరామరాజు, నిమ్మల సాయిబాబు,ఉప్పలపాటి జయదేవ్, బోయిన శ్రీనివాస్, తోట మహేష్, జయమంగళ తిరుపతి వెంకన్న, పండు గాంధీ, కూనవరపు సతీష్ ,తదితరులు పాల్గొన్నారు.
Tags kaikaluru
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …