Breaking News

మొదటి విడతలో మంజూరైన గృహనిర్మాణ లబ్దిదారులు వేగవంతంగా ఇళ్లనిర్మాణాలు పూర్తిచేయాలి…

-గృహనిర్మాణాలు వేగవంతం చేసేలా అధికారులు లబ్దిదారుల్లో అవగాహన కల్పించాలి..
-ఎమ్మెల్యే డిఎన్ఆర్

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో మొదటి విడతలో మంజూరైన లబ్దిదారులు గృహానిర్మాణాలకు ప్రారంభించకపోతే అర్హులై వుండి నిర్మాణాలు చేపట్టే వారికి కేటాయిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో శనివారం గ్రామవాలంటీర్లు, సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులు, హౌసింగ్ అధికారులతో గృహానిర్మాణాల పురోగతిని ఎమ్మెల్యే డిఎన్ఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ కైకలూరు వైఎస్ ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో మొదటి విడత నిర్మాణాలకు అనుమతించిన వారిలో చాలా మంది గృహానిర్మాణాలు ప్రారంభించక పోవడం శోచనీయం అన్నారు. సుమారు 10 లక్షల విలువైన భూమిని ఇచ్చి రూ.1.80 లక్షలు గృహానిర్మాణాలకు ఇచ్చి, ప్రతి పేదవారిని సొంతింటి వారిని చెయ్యాలనే తపనను లబ్ధిదారులు నీరు కార్చడం సహించరానిదన్నారు. ఇన్ని సదుపాయాలు కల్పిస్తుంటే లబ్ధిదారులు గృహాల నిర్మాణం చేయకపోవడ, వేరే ఆలోచనలు చెయ్యడం సరికాదన్నారు. కొందరు మెటీరియల్ తీసుకుని కూడా ప్రారంభించక పోవడం క్షమించరానిదన్నారు. మీ పరిధిలోని లబ్ధిదారుల్ని కలిసి వెంటనే గృహానిర్మాణాలు మొదలు పెట్టకపోతే వాటికి నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి అర్హులకు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మీ పరిధిలోని ఇళ్ళనిర్మాణం మొదలుపెట్టని లబ్ధిదారులతో 13 వ తేదీ సోమవారం ఉదయం లే అవుట్ లో సమావేశం జరుగుతుందని, మొదటి విడతలో మంజూరైన లబ్దిదారులను తప్పనిసరిగా హాజరు పర్చవలసిందిగా ఎమ్మెల్యే వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే జగనన్న పేదలకు మంచి చేసే విధంగా రూపకల్పన చేసిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం లబ్ధిదారులకు అర్ధం అయ్యే విధంగా తెలియచేసి ఓటీఎస్ ద్వారా వారికి హక్కు కల్పించే విధంగా పనిచేయాలని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని కోరారు.
ఎంపిపి అడివి కృష్ణ మాట్లాడుతూ కైకలూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా 100 ఎకరాల సువిశాల లే అవుట్ ఏర్పాటు ఎమ్మెల్యే కృషి అన్నారు. ఆయన పేదల పక్షపాతిగా ఎంతో పెద్దహృదయంతో పేదల ఇళ్ల కలను నిజం చేసే కృషిలో కొందరు విపరీత ఆలోచనల మూలంగా గృహానిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.
జడ్పీటీసీ కురేళ్ళ బేబీ మాట్లాడుతూ లే అవుట్ లో ప్లాట్లు పొందిన వారు చాలా అదృష్టవంతులని అయితే కష్టించి పనిచేసే ఎమ్మెల్యే కృషిని లబ్దిదారులు గుర్తించాలన్నారు.
ఉప ఎంపిపి మహ్మద్ జహీర్ మాట్లాడుతూ లబ్ధిదారులు తప్పని సరిగా ఎల్లుండి జరిగే సమావేశానికి హాజరయ్యేలా అధికారులు చూడాల న్నారు. సర్పంచ్ నవరత్న కుమారి మాట్లాడుతూ మీతో పాటు నేను కూడా తిరిగి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాన్నారు. ఎంపిటిసి మంగినేని రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే డిఎన్ఆర్ తీసుకున్ననిర్ణయం వెనుక ఆవేదనను అర్ధం చేసుకొని గృహనిర్మాణాలు వేగవంతంగా నిర్మించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మూడెడ్ల శ్యామల, హౌసింగ్ ఏ.ఈ మూర్తి, ఈఓ రామలక్ష్మి,ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *