Breaking News

ప్రసాదంపాడు గుంటతిప్ప డ్రైయిన్ పై చేపట్టిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి…. : జిల్లా కలెక్టర్ జె. నివాస్ 

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్ మరియు అధికారులతో కలసి జాతీయ రహదారి నందలి ప్రసాదం పాడు వద్ద గుంటతిప్ప డ్రైన్ పరిశీలన. జిల్లా కలెక్టర్ జె. నివాస్ శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ మరియు ఉన్నతాధికారులతో గుంట తిప్ప డ్రైన్ ద్వారా దుర్వాసన వేదజెల్ల కుండా జరుగుతున్న పనుల యొక్క పురోగతిని పర్యవేక్షించి పలు ఆదేశాలు ఇచ్చారు. డ్రైన్ నుండి వచ్చు దుర్వాసన అరికట్టుటకై GI రేకు ద్వారా ఏర్పాటు చేస్తున్న పై కప్పు పనులను పరిశీలిస్తూ, పనులు అన్నియు రేపు సాయంత్రం కలా పూర్తి కావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా డ్రైన్ నందు మురుగునీటి ప్రవాహమునకు అవరోధం కలుగకుండా డ్రైన్ నందలి చెత్త మరియు వ్యర్థములను తొలగించి పరిసర ప్రాంతాలలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానమును అవలంభించాలని చీఫ్ మెడికల్ అధికారిని జి. గీతాబాయిని ఆదేశించారు. కార్యక్రమములో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి. గీతాభాయి, డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, హెల్త్ ఆఫీసర్ శ్రీదేవి ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *