విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సెలవు దినాలలో విద్యాశాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యా సంస్థలు స్పెషల్ క్లాస్ లను (ప్రత్యేక తరగతులు) నడిపితే అడ్డుకుంటామని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (యన్.యస్.యు.ఐ.) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ సెలవు దినాలలో విద్యాశాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నగరంలోని పలు విద్యా సంస్థలు ప్రత్యేక తరగతులను నడుపుచున్నాయనీ, వాటిని ఈ రోజు పరిశీలన చేసి సదరు విద్యా సంస్థల యాజమాన్యాలను హెచ్చరించడమైనది అనీ, సదరు విద్యా సంస్థలు తమ హెచ్చరికలు పెడచెవిన పెట్టి విద్యాశాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా మరలా నడిపినచో ఈసారి ఆ విద్యా సంస్థలను ఖచ్చితంగా అడ్డుకుంటామనీ, సదరు విద్యా సంస్థల పనితీరుపై విద్యాశాఖ, ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ చేస్తామని, విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాల, కళాశాల గుర్తింపు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తరపున పోరాడతామనీ తెలియజేయడమైనదని యన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …