Breaking News

జగనన్న గ్రీన్ విలేజ్ గృహ నిర్మాణ లబ్దిదారులు వేగంవతంగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేయాలి… : శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న గ్రీన్ విలేజ్ లో త్వరగతిన ఇంటి నిర్మాణాలు ప్రారంభించి, నిర్మాణాలు పూర్తి చేయాలనీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు లబ్దిదారులకు సూచించారు. కైకలూరు ఏలూరు రోడ్డులో వున్న జగనన్న గ్రీన్ విలేజ్ లో సోమవారం హౌసింగ్ డీఈఈ ఆదినారాయణ, సర్పంచ్ డీఎం.నవరత్నకుమారి లతో కలిసి ఎమ్మేల్యే డిఎన్ఆర్ గృహనిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో ఎక్కడా లేని విధంగా కైకలూరు పట్టణానికి సుమారు వంద ఎకరాల భూమిని తీసుకుని 8 అడుగుల ఎత్తు మెరక పూడిక చేశామన్నారు. ఇక్కడ అక్కచెల్లమ్మలకు ఇంటి నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా విద్యుత్ నీరు,రోడ్లు వేసి పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. కేవలం ఈ గ్రీన్ విలేజ్ లో భూమి కొనుగోలు, మెరక, ఇళ్ల నిర్మాణం,ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రభుత్వం రూ. 189 కోట్ల 50 లక్షలు వ్యయం చేస్తుందని అన్నారు. ఇది ఒక చరిత్ర అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన అవకాన్ని అందిపుచ్చుకోవాలే గాని, కాల దన్నుకోరాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారులు ఎప్పటికి అప్పుడు మీకు సూచనలు చేస్తున్నా మీరు నిర్మాణాలు ప్రారంభించడం లేదు అని, మొదటి విడతలో 897మంది అక్కచెల్లమ్మలకు ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తే, ఇప్పటికి 236మంది మాత్రమే నిర్మాణలు ప్రారంభించారన్నారు. ఇంకా 661 మంది అక్కచెల్లమ్మలు ఇంటి నిర్మాణాలు ప్రారంభించలేదు, కావున మీరు అందరు కూడా వారం రోజుల లోపు ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. లేనిపక్షంలో మీ అందరి పట్టాలు రద్దు చేసి, అర్హులు అయిన పట్టాలు పొందిన అక్కచెల్లమ్మలు చాలా మంది వున్నారని, వారికీ మీ పట్టాలు ఇచ్చి వారితో నిర్మాణం చేయించి, ఇంటి పనులు పూర్తి చేస్తాం అని అన్నారు. అదేవిదంగా రెండవ విడతలో ఇచ్చిన ఇంటి పట్టాలు కూడా ఇంటి నిర్మాణాలకు అనుమతులు వచ్చాయని 898 పట్టా నెంబర్ నుంచి 1700 నెంబర్ వరకు ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామన్నారు. లబ్దిదారులు త్వరగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలనీ కోరారు. అదేవిదంగా హౌసింగ్, రెవిన్యూ అధికారులు, గ్రామ వాలంటరీలు, సచివాలయం ఉద్యోగులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోని ఇంటి నిర్మాణాలు ప్రారంభించేలా లబ్దిదారులకు అవగాహనకల్పించాలని ఆదేశించారు, కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ,,జడ్పీటీసీ కురేళ్ళబేబీ, వైస్ ఎంపీపీ మహ్మద్ జహీర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ఎంపీటీసీ మూడేడ్ల శశికళ, హౌసింగ్ డీఈఈ ఆదినారాయణ, హౌసింగ్ ఏఈ శ్రీరామచంద్ర మూర్తి, ఈఓ రామలక్ష్మి, మడక శ్రీనివాస్, పిచ్చుకల రాము, తోట మహేష్,, బుద్ధా మహాలక్ష్మి, దాసరి శంకర్, బలే నాగరాజు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *