Breaking News

ఖాజా బాబా ఆశీస్సులు ఈ ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు చాదర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మతసామరస్యానికి ప్రతీక అయిన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సమీపంలో ఉన్న ప్రఖ్యాత అజ్మీర్ షరీఫ్ దర్గా కు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  చాదర్ సమర్పించారు. 2022 ఫిబ్రవరి 6 న ఖాజా బాబా ఆశ్రమం 6 వ వార్షికోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ కు అజ్మీర్ వెళుతున్న అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలోని ఖాజా బాబా ఆశ్రమం కమిటీ ప్రతినిధులు సోమవారం మల్లాది విష్ణు గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు సర్వమానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీకగా రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ షరీఫ్ బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు నియోజకవర్గంలో నిర్వహించడం సంతోషదాయకం అన్నారు. ఖాజా బాబా ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  4 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తుచేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఖాజా బాబా ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, సంక్షేమం అందించాలని కాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ముస్లిం పెద్దలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. అనంతరం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ని ముస్లిం పెద్దలు సత్కరించారు. కార్యక్రమంలో ఖాజా బాబా ఆశ్రమ కమిటీ వ్యవస్థాపక ధర్మకర్త పఠాన్ బాబ్జి ఉమర్ ఖాన్, కమిటీ సభ్యులు వహీద్, ఎండి అతావుల్లా, భాష, సలీం రాజేష్, అలంపూరు విజయ్ కుమార్, ఆర్. ఎస్. నాయుడు, మైనార్టీ నాయకులు ఎండి హఫీజుల్లా, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *