-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం లబ్దిదారులకు అధికారులు అవగాహన కల్పించాలి..
-18 సం.రాలు వయస్సు నిండిన యువతీ యువకులు, ఓటరుగా తమ పేర్లును నమోదు చేసుకోవాలి..
-థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వ్యాక్సన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి.
-ఆర్డీవో శ్రీనుకుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరిం సత్వర న్యాయాన్ని ధరఖాస్తు దారులకు అందించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ఇచ్చిన అర్జీలు సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలన్నారు. తమ పరిధిలోని కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందున్న డివిజన్ పరిధిలో గల మండల స్థాయి, గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ పై అధికారులు లబ్దిదారులకు అవగహాన కల్పించాలి..:- రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో తెలిపారు. గృహనిర్మాణాలు నిమిత్తం తీసుకున్న రుణాలు పెండింగ్ లో ఉంటె వారికి సదరు ఆస్తిపై హక్కు ఉండదని, అటువంటి సమస్య నుండి వారిని బయటకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటిఎస్ పధకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 10 వేల పైన ఎంత ఋణం ఉన్నప్పటికీ, కేవలం 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించాలని, లేదా 10 వేల లోపు ఋణం మొత్తం ఉన్నవారు ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ పధకం వినియోగించుకుని రుణ విముక్తులు అవడంతో పాటు సదరు ఆస్తిపై అమ్ముకునే, బ్యాంకులలో తనఖా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వినియోగించుకుని రుణ విముక్తులు అయ్యేందుకు ఇది గొప్ప అవకాశమన్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. :-
కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్ పోయిందని ఎవరూ భావించవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నరు.
2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతీ,యువకులు ఓటరుగా నమోదు కావాలని ఆర్డీవో పిలుపునిచ్చారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేరు, అడ్రస్సు మార్పులు, చేర్పులు సంబందించి ఫారం7, 8, లను వినియోగించుకోవచ్చునన్నారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిఎల్పీవో నాగిరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ.సి.గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News