
-రాయలసీమ ధర్మదీక్ష కు పలు సంఘాల సంఘీభావం
-విజయవాడలో విజయవంతమైన రాయలసీమ ధర్మ దీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమ హక్కుల సాధన కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో 13 వ తేదీన రాయలసీమ ధర్మ దీక్ష జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు ప్రభుత్వం ప్రకటించిన హైకోర్టును తక్షణం కర్నూలు లో ఏర్పాటు చేయాలని, కృష్ణా నది యాజమాన్య బోర్డు ను కర్నూలులో నెలకొల్పాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొని ప్రస్తుతం అనుమతించని ప్రాజక్టులుగా చెబుతున్న హంద్రీ నీవా, గాలేరు – నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ అనుమతించిన ప్రాజెక్టు లుగా సవరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల నుండి వివిధ ప్రజా సంఘాల నేతలు వందలాదిగా ధర్మ దీక్షకు తరలివచ్చారు. సీమ న్యాయమైన డిమాండ్లను అన్ని పార్టీలు, ప్రభుత్వం అండగా నిలవాలని లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు.
ఈ ధర్మ దీక్ష రాజకీయ పార్టీల నుండి సి.పి.యం రాష్ట్ర కార్యదర్శి మధు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు వెంకటేశ్వర రావులు సంఘీభావం ప్రకటించారు. రాయలసీమ కళాకారులు రామాంజి, అరుణోదయ కళాకారుల బృందం సీమ గేయాలు పాడారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాంస్కృతిక వేదిక నాయకులు డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు డా.శీలం సురేంద్ర రెడ్డి, కానాల సుధాకర్, రమణారెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ప్రభాకరరెడ్డి, కర్నులు బార్ అషోసియేషన్ నాయకులు సుబ్బయ్య, ఓంకార్, నాగలక్ష్మి దేవి, ప్రకాష్ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక హమీద్, పద్మ, వెంకటేష్, రవి, జలసాధన సమితి నాయకులు పెద్దన్న, ఐ.యఫ్.టీ.యు నాయకులు ఏసు విరసం నాయకులు అరసవిల్లి కృష్ణ , వరలక్ష్మి, చైతన్య మహిళా సంఘం రాధ,
కె.వి.పి.యస్ నాయకులు దుడ్డు ప్రభాకర్, ఎ.పి.జె.ఏ సి కార్యదర్శి హృదయ రాజు, రాయలసీమ జర్నలిస్టు పోరం వనం శర్మ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రామకృష్ణారెడ్డి, రైతు సంఘం నాయకులు ఎర్నేని నాగేంద్ర నాథ్, కోటిరెడ్డి, రాయలసీమ విద్యార్థి సంఘాల నాయకులు కృష్ణ, ఊసన్న, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రవి కుమార్, పి.డి.యస్.యు నాయకులు ప్రకాశ్, ఆది రాయలసీమ కోఅర్డినేషన్ కమిటీ లోకేష్, రామరాజు, నవీన్, బసవేశ్వర రైతు సంఘం కొండారెడ్డి, డి.టి.యఫ్ క్రిష్ణయ్య, ప్రగతిశీల కార్మిక సమాఖ్య కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News