అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ నివేదికపై కార్యదర్శుల స్థాయి కమిటీ సిఫార్సులను సోమవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధ్యక్షతన గల కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది.అనంతరం సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో సిఎస్ డాక్టర్ సమీర్ శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ పిఆర్సీపై చేసిన సిఫార్సులను మీడియాకు వివరించింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పిఆర్సీపై తుది నిర్ణయాన్ని మూడు రోజుల్లోగా అనగా 72 గంటల్లో ముఖ్యమంత్రి వెల్లడించే అవకాశం ఉందని సిఎస్ డా.సమీర్ శర్మ తెలిపారు.ఈకమిటీ సిఫార్సులను ఆర్ధికశాఖ వెబ్ సైట్ https://www.apfinance.gov.in/లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈమీడియా సమావేశంలో కార్యదర్శుల కమిటీ సభ్యులు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధికశాఖ, మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ తోపాటు ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం)పి.చంద్రశేఖర్ రెడ్డి, సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …