కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ వ్యాప్తంగా 22 థియేటర్లను మొదటి విడతగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు.శుక్రవారం స్థానిక అనన్య థియేటర్ ను ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు వివరాలు తెలుపుతూ, ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు డివిజన్ వ్యాప్తంగా తహసీల్దార్ లు ద్వారా సినిమా థియేటర్లు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అధిక రేట్లు, కోవిడ్ మార్గదర్సకాలు, ప్రభుత్వ నియమాలకు సంబంధించిన అంశాలపై తనిఖీలు నిర్వహించారని తెలిపారు. మొత్తం 22 థియేటర్లను తనిఖీ లు చేసామని పేర్కొన్నారు. అనన్య థియేటర్ తనిఖీలో ఎటువంటి ఉల్లాఘనలు లేనట్లు గుర్తించామన్నారు. డివిజన్ పరిధిలో చేసిన సినిమా థియేటర్ల తనిఖీల్లో భాగంగా 12 థియేటర్లపై రూ.10 వేలు చొప్పున జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని మూడు సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినీమా హాళ్లు మూసివేశారని మల్లిబాబు పేర్కొన్నారు.
Tags kovvuru
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …