విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్‌ఎస్‌యు) ఉప కులపతి ఆచార్య వి.మురళీధర శర్మ గురువారం తీవ్ర గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆచార్య వి.మురళీధర శర్మ హయాంలోనే తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా ఉన్నతిని పొందిందని, ఆయన ఆకస్మిక మరణం సంస్కృత విశ్వవిద్యాలయానికి తీరని లోటని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …