అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ పండుగలన్నీ ప్రకృతి-పర్యావరణం ఆధారిత సంబరాలే! ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగ. ప్రకృతిపరంగా చూస్తే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే తరుణంలో వచ్చే ఈ పండుగను మకర సంక్రాంతిగా జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యవంతంగా విలసిల్లాలి. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారతీయులందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News