ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రీవెన్స్ పరిస్కారం, గ్రామ ,వార్డు సచివాలయం ద్వారా ప్రతి ఇంటికి సేవలు దించేందుకు కృషి చేస్తానని అన్నారు. నవరత్నాలు , సంక్షేమ కార్యక్రమాలు , రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు , ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి , కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గృహ నిర్మాణం పేదలందరికి ఇళ్లు, స్మార్ట్ టౌన్ షిప్, గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమా లు ప్రధాన్యతా అంశాలని వీటిపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హిమాన్సు శుక్లా , జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , జయింట్ కలెక్టర్ పి. పద్మావతి, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ వి దేవిడ్ రాజు, ఏలూరు ఆర్డీవో పనబాక రచన, హౌసింగ్ పి డి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Tags Eluru
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …