Breaking News

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రసన్న వెంకటేష్

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్  బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రీవెన్స్ పరిస్కారం, గ్రామ ,వార్డు సచివాలయం ద్వారా ప్రతి ఇంటికి సేవలు దించేందుకు కృషి చేస్తానని అన్నారు. నవరత్నాలు , సంక్షేమ కార్యక్రమాలు , రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు , ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి , కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గృహ నిర్మాణం పేదలందరికి ఇళ్లు, స్మార్ట్ టౌన్ షిప్, గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమా లు ప్రధాన్యతా అంశాలని వీటిపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హిమాన్సు శుక్లా , జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , జయింట్ కలెక్టర్ పి. పద్మావతి, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ వి దేవిడ్ రాజు, ఏలూరు ఆర్డీవో పనబాక రచన, హౌసింగ్ పి డి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *