అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందిచటమే ధ్యేయంగా విభిన్న కార్యక్రామాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. బెంగుళూరులోని కర్ణాటక మీడియా అకాడమీని ఆయన సందర్శించారు. ఈ సంధర్బంగా సి.రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ మరియు కర్ణాటక మీడియా అకాడమీ పరస్పరం సహకరించుకొనేందుకు గల అవకాశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న వెబ్ సైట్, సోషల్ మీడియా, జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులతో పాటు జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న పలు అవగాహాన కార్యక్రమాలను ఏపీ ప్రెస్ అకాడమీ టెక్నికల్ కన్సల్టెంట్ పిఎన్ ప్రసన్న కుమార్ వివరించారు. దాదాపు 15 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కర్ణాటక మీడియా అకాడమీని సందర్శించారని కర్ణాటక మీడియా అకాడమీ ఛైర్మన్ కె.సదాశివ్ షెనాయ్ సంతోషం వ్యక్తం చేసారు. జర్నలిస్టులకు ఉపయోగపడేలా ఏపీ ప్రెస్ అకాడమీ చేస్తున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో కర్ణాటక మీడియా అకాడమీ సెక్రటరీ సి.రూప, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …