Breaking News

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని బుధ‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా షేక్‌ రషీద్‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్, ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. షేక్‌ రషీద్‌ స్వస్ధలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ క్రికెట్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న 17 ఏళ్ళ రషీద్‌. టీమిండియా యువ జట్టు ఆసియా కప్‌ గెలవడంలోనూ, అండర్‌ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలోనూ కీలకపాత్ర పోషించారు. ఈ కార్య‌క్ర‌మంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్‌ తండ్రి బాలీషా, ద ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు, శాప్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *