తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ కు నిరంతరం పాల సరఫరా చేసేవారినే ప్రమోటర్లుగా ఎంపిక చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ చెప్పారు. తిరువూరు మండలం మల్లెల గ్రామంలోని గ్రామ సచివాలయం ఆవరణలో ప్రమోటర్లు, మహిళా పాడి రైతుకు, సిబ్బందితో జగనన్న పాలవెల్లువ అవగాహన సమావేశంలో జేసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం విజయవంతంలో ప్రమోటర్లు పాత్ర ప్రముఖమైనదని, మహిళా డైరీ అసోసియేషన్ కేంద్రం లో ప్రమోటర్లుగా నియమించబడే వాళ్ళ ఎంపికలో ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుందన్నారు. నిరంతరం కేంద్రానికి పాలు సరఫరా చేసేవారు, కేంద్రం అభివృద్ధికి కృషి చేసేవారిని ప్రమోటర్లుగా ఎంపిక చేయాలన్నారు. మహిళా పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం ఎంతగానో తోడ్పడుతుందని, ఈ పధకం ప్రయోజనాలను అన్ని గ్రామాలలోని పాడిరైతులకు తెలియజేసి, పాల సేకరణను మరింత పెంచాలన్నారు. అనంతరం కోకిలంపాడు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ కార్యక్రమం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ నరసింహారావు, ఎంపిడిఓ సంబంధిత గ్రామ సర్పంచ్ లు, పశుసంవర్ధక శాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags tiruvuru
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …