జగనన్న పాల వెల్లువ ప్రయోజనాలు మహిళా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి… : జేసీ కె. మోహన్ కుమార్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ ప్రయోజనాలు ప్రతీ మహిళా పాడి రైతు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ సచివాలయం ఆవరణలో శుక్రవారం జగనన్న పాలవెల్లువ పథకంపై ప్రమోటర్లు, మహిళా పాడిరైతులు, సిబ్బందితో ఏర్పటుచేసిన అవగాహనా కార్యక్రమంలో జేసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జేసీ మోహన్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం మహిళా పాడిరైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. జగనన్న పాలవెల్లువ పాల కేంద్రానికి పాలు అందించే పాడి రైతులకు స్వల్పకాలిక రుణంగా 30 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. నిరంతరంగా పాలు అందించినట్లైతే పాడి పశువులు కొనుగోలుకు 2 లక్షల రూపాయల వరకు ధీరకాలిక రుణంగా మంజూరు చేయడం జరుగుతుందని, అంతేకాక అమూల్ సంస్థ నుండి మంచి పోషకాలతో కూడిన దాణాను సబ్సిడీపై అందించడంతో పాటు పాడి పశువులకు వైద్య సౌకర్యం కూడా కలిగిస్తారన్నారు. పాలకు లీటరుకు ప్రైవేట్ డైరీల కన్నా 5 నుండి 7 రూపాయల వరకు అదనంగా ఆదాయం వస్తుందని, నెలకు 3 నుండి 5 వేల రూపాయల వరకు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఇటువంటి ప్రయోజనాలన్నిటినీ పాడి రైతులకు తెలియజేసి గ్రామాలలో పాల సేకరణ మరింతగా పెంచాలని ప్రోమోటర్లను జేసీ ఆదేశించారు. జగనన్న పాలవెల్లువ పధకం విజయవంతంలో ప్రమోటర్లు పాత్ర ప్రముఖమైనదని, మహిళా డైరీ అసోసియేషన్ కేంద్రం లో ప్రమోటర్లుగా నియమించబడే వాళ్ళ ఎంపికలో ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుందన్నారు. నిరంతరం కేంద్రానికి పాలు సరఫరా చేసేవారు, కేంద్రం అభివృద్ధికి కృషి చేసేవారిని ప్రమోటర్లుగా ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ జి. రాణి, తహసీల్దార్ ఎల్లారావు, గ్రామ సర్పంచ్, పశుసంవర్ధక శాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *