Breaking News

మదనపల్లెలో లక్ష గొంతులతో జనగణమన ను వినిపిస్తాం…

-జాతీయ గీతాన్ని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం
-పోలీసులు అడ్డుకోవడం అమానుష చర్య
-త్వరలో మదనపల్లెలో జనగణమనను లక్ష గొంతులతో వినిపిస్తాం – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ ప్రభుత్వం దేశ ద్రోహానికి ఒడిగట్టిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు జాతీయ గీతాన్ని ఆలపించిన మదనపల్లె పట్టణంలో జాతీయ గీతాన్ని స్మరించుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా పోలీసు బలగాలతో వైసీపీ ప్రభుత్వం అణచి వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రవీంద్రనాధ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని అనువదించిన మదనపల్లిలో జాతీయగీతం పాడేందుకు కూడా పోలీసులు అడ్డుకోవడం అమానుష చర్య అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి దేశభక్తి అన్నా, స్వాతంత్రం విలువలు అన్న గౌరవం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. జనగణమన గీతాన్నిమదనపల్లిలో ఫిబ్రవరి 28న బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించిన రవీంద్రనాథ్ ఠాగూర్ కు నివాళులర్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. త్వరలో మదనపల్లెలో జనగణమనను లక్ష గొంతులతో వినిపిస్తామని స్పష్టం చేశారు. జాతీయ గీతానికి వైసీపీ ప్రభుత్వం అవమానించే రీతిలో ప్రవర్తించిందని, దీన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ ప్రభుత్వానికి పోలీసులు వంత పాడటం జాతీయ గీతాన్ని అవమానించినట్లే కనబడుతోందని తెలిపారు. మదనపల్లి బంద్ను అడ్డుకోవడానికి పోలీసులు ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని తలపించారని శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *