Breaking News

మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు చేయూత

–మండల స్థాయిలో బ్యాంకుల విస్తరించాలి
–నైపుణ్యాభివృద్ధికి సహకార శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలి
–నాబార్డు చైర్మన్‌ చింతాల గోవిందరాజులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు అధిక ప్రాధాన్యతని స్తుందని నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. సహకార రుణపరపతి పునవ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్‌పర్శన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాబార్డు చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార రంగాభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు.రాష్టంలో డిసిసిబిల బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. రాష్ట్రంలో సొసైటీల పరిధిలో గొడౌన్స, కోల్డ్‌ స్టోరేజ్, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు. ఆర్బీకే స్థాయిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌ను తీసుకు రావడం నిజంగా శుభపరిణామన్నారు. సహకార బ్యాంకుల బలోపేతానికి షేర్‌ క్యాపిటల్‌ కావాలంటే ప్రతిపాదనలు పంపిస్తే ఆర్ధిక సర్దుబాటు చేసేందుకు నాబార్డు సిద్దంగా ఉందన్నారు. రాష్ట్ర కో ఆపరేటివ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంస్థ ద్వారా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే సహకార బ్యాంకులు ప్రొఫిషనల్‌గా తయారవు తాయని సూచించారు. పెసలు, మినుములు పండించే రైతుకు కిలో రూ.60లు వస్తుంటే. ప్రొసెస్‌ చేసి మార్కెట్‌లో రూ.200కు పైగా అమ్ముతున్నార న్నారు.ఆ వ్యత్యాసం రైతులకు చేరాలంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రొసెస్‌ చేసి వాల్యూఎడిషన్‌ చేయడం చాలా అవసరమన్నారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం వాల్యూచైన్‌ ఫైనాన్స్‌ దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్లు జరుగుతుంటే, మన మిచ్చేది కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమేనన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.58వేల కోట్లు ఇవ్వగా, దాంట్లో రూ.22 వేల కోట్లు ఏపీ, తెలంగాణాలోనే ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నావడ్డీ పథకం వందశాతం రీ–పేమెంట్‌ జరుగు తుందన్నారు. ప్రతీ బ్యాంక్‌ డ్వాక్రా సంఘాలకు కనీసం 300–400 కోట్ల రుణాలు ఇవ్వగలిగితే రూ.30 కోట్లు ఆదాయం వచ్చినట్టేనన్నారు.కౌలు రైతులను జాయింట్‌ లయబులిటి గ్రూప్స్‌(జేఎల్‌జీ) ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వొచ్చున్నారు.

డీసీసీబీల వర్గీకరణపై అధ్యయనం : మంత్రి కన్నబాబు
అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహకార శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.గత ప్రభుత్వం చెల్లించ కుండా వదిలేసిన రూ.1000 కోట్ల పావలా వడ్డీ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేసి సహకార బ్యాంకులకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. ఆప్కాబ్‌కు రూ.100 కోట్లు, 9 డీసీసీబీలకు రూ.195 కోట్లు షేర్‌ క్యాపిటల్‌ రూపంలో ఇచ్చేందుకు ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నష్టాల్లో వున్న డిసిసిబిలను లాభాల బాటలో పెట్టామని, రానున్న ఆర్ధిక సంవత్సరంలో కనీసం వంద బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. 3–5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతీ ఉద్యోగిని బదిలీ చేసే విధంగా రూపొందించిన హెచ్‌ఆర్‌ పాలసీని త్వరలో అమలు చేయబోతున్నామన్నారు. ఆర్బీకే–పీఏసీఎస్‌లను అనుసంధా నించే విషయంలో అధ్యయనం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాట వుతున్న నేపథ్యంలో డీసీసీబీలను ఇప్పటికిప్పుడు వర్గీకరించాలా లేదా అనే అంశంౖపై అధ్యయనం జరుగుతోందన్నారు. వయబిలిటీ లేకుండా వర్గీకరిస్తే లేనిపోని ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. గామ స్థాయిలో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలో ఓ పాలసీని కూడా తీసుకొస్తున్నామన్నారు. మండలానికో భ్రాంచ్‌ ఏర్పాటుపై కసరత్తు జరుగు తోందన్నారు. రుణాలు ఇచ్చేప్పుడు , తిరిగి చెల్లించెటప్పుడు ఎటువంటి వత్తిడిలకు తలొగ్గకుండా పని చేయాలనీ సీఎం జగన్‌ స్పష్టం చేసారని మంత్రి కన్నబాబు అన్నారు. అంతకు ముందు కృష్ణా జిల్లా సహకార కేంద్రబ్యాంక్‌ ఏటీఎం, లాకెర్స్‌ కాంప్లెక్స్‌ సముదాయాలను మంత్రి కన్నబాబు, నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో సహకార శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ అహ్మద్‌ బాబు, ఆప్కాబ్‌ చైర్మన్‌ మల్లెల ఝాన్సీరాణి, ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, ఆప్కాబ్‌ జీఎం ఉదయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *