Breaking News

గొల్లపూడిలో ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… 

 


గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గొల్లపూడిలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ అద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన పార్టీ పండుగ. నాలుగేళ్ల క్రితం అందరికి ఆశలు కల్పిస్తూ, కోట్లాది మంది హృదయాలలో ఆశలు నింపుతూ వారి ఆకాంక్షలను తీర్చిదిశగా అడుగులేస్తున్న పార్టీ మనదన్నారు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమము రెండు కళ్ళుగా పార్టీ అభివృద్ధిలో ముందుకు వెళ్ళుతూ, అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిత్యం వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పరచుట జరుగుతుందని, రాబోవు రోజులల్లో మన మఖ్యమంత్రి సారధ్యంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమములో మొదటి స్థానంలో నిలుపుతారన్నారు.  సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఏ నిర్ణయం అయినా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటురాని తెలిపారు. రాజన్న పాలన మళ్లీ మనం మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహనరెడ్డి ద్వారా తిరిగి పొందడం మన అదృష్టమని అన్నారు. 2024లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా చేయాలని ప్రతి కార్యకర్త కృషి చేయాలని సైనికులు లాగా పనిచేయాలని కోరారు. అనంతరం కేకు కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైయస్ అభిమానులు, స్థానికులు, భారీ సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *