-మంత్రి అవంతి శ్రీనివాసరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ( అవంతి) తెలిపారు. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఏప్రిల్ 9,10 తేదీల్లో విశాఖపట్నంలో సదస్సులను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పర్యాటక, సాంస్కృతికశాఖలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులనుసేకరించడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసి పర్యాటకులను ఆకర్షించడానికి వీలుకలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధిని నీరుగార్చిందని మంత్రి విమర్శించారు. ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా పెట్టు బడులను సేకరించడంలోను గత ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు సంబంధించి ప్రత్యేక యాప్ ను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించేందుకుగాను నది పరివాహక ప్రాంతాల్లో బోటింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. టూర్ ఫ్యాకేజ్ లను ప్రోత్సహించే విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన కోరారు ఫ్యాకేజ్ లో భాగం గా రాష్ట్రంలో ఉన్న ఆరు విమానా శ్రయాలనుండి ప్రత్యేక బస్ లను నడపాలని అవంతి శ్రీనివాసరావు ఆదేశాంచారు. అలాగే విశాఖ ,తూర్పుగోదావరి, కడప, గుంటూరు జిల్లాల్లో టూరిజం ఫెస్టివల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక శాఖద్వారా జరుగుతున్న పనులన్నింటిని తర్వితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెస్టారెంట్లలో వసతి సౌకర్యాలను మెరుగుపర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల కార్యక్రమాలఅమలుకు సంబంధించి సాంస్కృతిక శాఖ ద్వారా ఉగాది పురస్కారాలు అందజేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విస్త్రతంగా ప్రచారం చేయాలని ఆయన సాంస్కృతిక శాఖను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్ధ ఛైర్మన్ వరప్రసాదరెడ్డి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పర్యాటకాభివృధ్ధి సంస్ధ మేనేజింగ్ డైరక్టర్ సత్యనారా యణ, ఇతర ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు.