Breaking News

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు గా చేసుకుని ప్రభుత్వ పాలన అందిస్తున్నాం…


-భవిష్యత్తులో ” మానవ వనరుల హబ్ ” గా ఆంధ్ర ప్రదేశ్..
-1 లక్షా 70 వేల మంది ప్రవాసాంధ్రులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు..
-ప్రభుత్వ సలహాదారు ఎమ్. జ్ఞానేంద్ర రెడ్డికి పలువురు అభినందనలు..
-ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి..
-పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి..
-ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నదని, రాష్ట్రంలో 80% శాతం మంది ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్ర వ్యవహారాలకు సంబంధించి ఎమ్. జ్ఞానేంద్రరెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినందులకు గాను ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి మాట్లాడుతూ గడప గడపకూ సంక్షేమ అభివృద్ధి పధకాలను అందిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జనరంజకమైన పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్.సి., ఎస్.టి. సంక్షేమాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్నాయన్నారు. కష్టపడి పనిచేసేవారికి మంచి గుర్తింపు ఉంటుందని దీనికి ఎమ్. జ్ఞానేంద్ర రెడ్డి ఉదాహరణగా చెప్పవచ్చునన్నారు. ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే జ్ఞానేంద్ర రెడ్డికి ప్రవాసాంధ్ర వ్యవహారాలకు సంబందించిన ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ఎంతో అభినందనీయమని నారాయణస్వామి అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పనిచేసేతత్వం, 10 మందికి సహాయం చేసే గుణం ఉన్న జ్ఞానేంద్ర రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిరాడంబరత, అందరికంటే 10 రెట్లు ఎక్కువుగా పనిచేస్తారని, నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పరిపాలన సాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలంతా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నారు. తెలుగు ప్రజలు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చదువు రీత్యా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఎంతో మంది ఉన్నారని వారియొక్క ప్రయోజనాలు కాపాడడానికి, వారు మన రాష్ట్రానికి సరి అయిన సహకారం అందించేందుకు, రాష్ట్రాభివృద్ధిలో వారివంతు పాత్ర పోషించేందుకు అవసరమైన వేదికను ఏర్పాటు చేయడమే ద్యేయంగా ప్రవాసాంధ్ర వ్యవహారాలకు సంబందించిన ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి పనిచేస్తారని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా అనేక కష్టాలను అధిగమించి కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొని, ఏఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజలకు అందిస్తున్నామన్నారు. క్రొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పాలనాపరంగా వికేంద్రీకరణ సాధ్యమన్నారు. ఇతర దేశాల్లో ఉన్నవారి ప్రయోజనాలను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్ర వ్యవహారాలను సమర్దవంతం నిర్వహించాలని భావిస్తున్నదని దీనిలో భాగంగా ఎమ్. జ్ఞానేంద్ర రెడ్డిని ప్రభుత్వ సలహాదారునిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నియమించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలలో ఉన్న నిపుణులైన వైద్యులు, సాంకేతిక నిపుణులు, వ్యాపార నిపుణులు, విద్యా రంగ నిపుణుల సేవలను ఉపయోగించుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ ను నిపుణులైన “మానవ వనరుల హబ్” గా తయారు చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
ప్రవాసాంధ్ర వ్యవహారాలకు సంబందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రవాసాంధ్రుల ప్రయోజనాలను కాపాడుటతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్. జ్ఞానేంద్ర రెడ్డి అన్నారు. సుమారు 1 లక్షా 70 వేల మంది ప్రవాసాంధ్రులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వద్ద రిజిస్ట్రర్ చేసుకుని ప్రభుత్వం అందజేస్తున్న వివిధ రకాల సేవలను పొందుతున్నారన్నారు. ” కనెక్టెడ్ టూ ఆంధ్ర ప్రదేశ్ ” ద్వారా ప్రవాసాంధ్ర దాతలు మన ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేయడానికి అవసరమైన సహకారం అందించడం జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఐ గ్రీవియెన్సు సెల్ ద్వారా పెట్టుబడిదారులకు అవసరమైన సురక్షిత వాతావరణాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం ద్వారా విదేశాల్లో తెలుగు ప్రజలు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం బారిన పడి మరణించినప్పుడు మరియు శాశ్వత అంగవైకల్యం సంభవించిన వారికి 10 లక్షల రూపాయలు భీమా ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. విదేశాల్లో ఏదైనా విపత్తులు సంబవించినప్పుడు వారిని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. ఇటీవల ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకు పోయిన తెలుగువారిని విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని జ్ఞానేంద్ర రెడ్డి అన్నారు.
ముందుగా ధన్యవాదాలు తెలుపుటకు సమావేశాన్ని (థాంక్స్ గివింగ్ మీటింగ్) ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్  గండికోట శ్రీకాంత్ రెడ్డి, శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎన్. వెంకట గౌడ్, తిప్పి స్వామి, కోనేటి ఆదిమూలం, మద్య విమోచన ప్రచార కమిటి చైర్మన్ వి. లక్ష్మణ రెడ్డి, ప్రత్యేక అధికారి (ఇంటర్నేషనల్ కో ఆర్డినేషన్) రిటైర్డ్ ఐ.ఎఫ్.ఎస్. శ్రీ గీతీష్ శర్మ, కడప రత్నాకర్, చిత్తూర్ జిల్లాకు చెందిన మేయర్ లు, జెడ్.పి.టి.సి. సభ్యులు, ఎమ్.పి.పి. సభ్యులు, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *