-స్వామి నారాయణ గురుకుల పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే వసంత…!!
-ఘనంగా స్వామి నారాయణ గురుకుల పాఠశాల వార్షిక బహుమతి ప్రధానోత్సవం…!!
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామ పరిధిలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రతిభ అనన్యసామాన్యం అంటూ అభినందించారు. స్వామి నారాయణ గురుకుల పాఠశాల వార్షిక బహుమతుల ప్రధానోత్సవం లో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అనుసరిస్తున్న క్రమశిక్షణ, క్రీడల్లో చూపుతున్న ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.. ఉన్నత విలువలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా స్వామి నారాయణ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పనిచేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవం లో భాగంగా ప్రముఖుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వామి నారాయణ గురుకుల పాఠశాల లో అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యా , సద్విద్య, బ్రహ్మ విద్య అందించడమే లక్ష్యంగా సమాజం లో గొప్ప సంస్కరణకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, నందిగామ డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి , ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్యవైశ్య ప్రెసిడెంట్ ముక్కల ద్వారకానాథ్, ప్రముఖ న్యాయవాది నిమ్మగడ్డ సత్యనారాయణ, ఎన్ హెచ్ ఎ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News