విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ విసి & మేనేజింగ్ డైరెక్టర్ గా బుధవారం నూతనం గా నియమితులైన షేక్ షిరీన్ బేగం బాధ్యత లు స్వీకరించారు. ఈమె సర్వే కమీషనర్ ఆఫ్ వక్ఫ్, తాడేపల్లి నందు పని చేస్తూ మైనారిటీ కార్పొరేషన్ వి.సి & యమ్. డి (యఫ్.ఎ.సి) గా బాధ్యత లు తీసుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్, షేక్ ఆసీఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ ప్రదాన కార్యాలయంలో ఆమె ను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు. తదనంతరం యస్.ఆలీమ్ బాష విసి & యమ్. డి, గా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రిలీవ్ అవ్వడం జరిగింది. చైర్మన్, షేక్ ఆసీఫ్ మరియు కార్పొరేషన్ అధికారుల సమక్షంలో ఆలీమ్ బాష ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆలీమ్ బాష కార్పొరేషన్ కు చేసిన సేవలు ను కొనియాడుతూ మరింత ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాక్షించారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …