విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు అందించడంలో ముందుకు వస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలను జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్ అభినందించారు. జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మదర్‌తెరిసా చారిటబుల్ సాసైటి తాడేపల్లి గూడెం స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిర్థారణ శిభిరం నందు గుర్తించిన 33 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు కాలిపర్స్‌వాకర్స్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మోహన్‌కుమార్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. స్థానిక గుణదలలోని సెయింట్ ఆలోషియన్ హోమ్ నందు గురువారం జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను సమగ్ర శిక్ష ద్వారా అందించడం జరుగుతుందని వాటితో పాటుగా స్వచ్ఛంద సంస్ధలు కూడా ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. అలాగే మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ మోజస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐజాక్ ప్రత్యేకంగా అభినందించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ డా శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రత్యేక అవసరాలు గల వారికి ఉపకరణములు అందించడం మంచి పరిణామమని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు సేవ చేయడం భగవంతుని కి సేవ చేయడమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా సహిత విద్య సమన్వయకర్త శ్రీకాకుళపు రాంబాబు సెయింట్ జేవియర్ ప్రాంతీయ ఉన్నతాధికారి సిస్టర్, ఉన్నాతాధికారి సిస్టర్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …