విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అర్హతగల పాస్టర్లకు నెలకు రూ. 5000/` గౌరవవేతనం పొందేందుకు వీలుగా ధరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని యండి రియాజ్ సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు అర్హత గల పాస్టర్లకు గౌరవ వేతనం తీసుకునేందుకు సంబంధిత ధరఖాస్తులను ఈనెల 21వ తేదీ లోపు సమర్పించాలని ఆమె కోరారు. చర్చికి సంబంసధించిన భూమి చర్చి పేరుపై నమోదై వుండాలని, తహాశీల్థార్ జారీ చేసిన స్వాధీన దృవీకరణ పత్రం, దాతలు బహుమాన రూపంలో ఇచ్చిన చర్చి స్థలానికి సంబంధించిన పత్రాలు కూడా ధరఖాస్తుతో పాటు సమర్పించాలన్నారు. అర్హులైన చర్చ్ పాస్టర్లు గ్రామ/ వార్డు సచివాలయాల్లో తగిన పత్రాలతో ఈనెల 21వ తేదీ లోపు అన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని యండి రియాజ్ సుల్తానా ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …