విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నివారణకు స్వచ్ఛంద సంస్థలు ముందకు రావడం అభినందనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.యం సుహాసిని అన్నారు. ఫైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డాక్టర్స్‌ఫర్ యు స్వచ్ఛంద సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్ఫాన్స్‌భుల్టీలో భాగంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు రూ. 5 లక్షల విలువైన ఎన్`95 మాస్క్, శానిటైజర్లను సంస్థ ప్రతినిధులు గురువారం క్యాంప్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.యం సుహాసినికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి నివారణలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. డాక్టర్స్‌ఫర్ యు స్వచ్ఛంద సంస్థ స్పూర్తిగా తీసుకుని మరెంన్ని స్వచ్ఛంద సంస్ధలు ముందుకు రావాలని ఆమె కోరారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …