-46వ డివిజన్ లంబాడిపేట హోలీ వేడుకలలో పాల్గొన్న నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోను పండుగ హోలీ, ఈ పండుగ వేళ భగవంతుని కరుణా కటాక్షలతో అందరు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. డివిజన్ పరిధిలోని లంబాడిపేట నందు లంబాడిలు, బంజారీలు ఎన్నో ఏళ్లుగా ఉంటూ అందరు కలసి ప్రతి ఏటా ఆనందంగా హోలీ నిర్వహించడం జరుగుతుందని, వారితో కలసి వేడుకలలో పాల్గొనుట సంతోషకరమని అన్నారు. వేడుకలు పాల్గొనిన మేయరు లంబాడి సోదరిమణులతో కలసి రంగులు చల్లుకుంటూ నృత్యాలతో సందడి చేశారు. కార్యక్రమంలో వై. సి. పి. నాయకులు రాయన నరేంద్ర, స్థానిక ప్రజలు, డివిజన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.