Breaking News

కొడాలి, వంగవీటి భేటీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలలో వారిద్దరూ ఫైర్ బ్రాండ్స్. ఒకరు అధికార పార్టీలో అమాత్యుడు. మరోకరు ప్రతిపక్షంలో అత్యంత కీలక వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించే మూడు సామాజిక వర్గాలలోని రెండింటికి వీరు ప్రతినిధులు. కాని ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విధాన పరమైన నిర్ణయాల విషయంలో వీరిద్దరు శత్రువులే . కాని మంచి మిత్రులు. వారి ఛాయాచిత్రాలను చూసినప్పుడు తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు వీరిని ఎవ్వరూ పరిచయం చేయనవసరం లేదు. వారిలో ఒకరు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మరోకరు వంగవీటి రాధాకృష్ణ (రాధా). రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు అని భావించే వీరిరువురు శనివారం గుడివాడలో కలిసారు. సీనియర్ రాజకీయ నాయకుడు అడపా వెంకట రమణ (బాబ్జి) అకస్మిక మృతి నేపధ్యంలో వీరు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నివాళి అర్పించారు. ఖాళి సమయంలో ఇదిగో ఇలా అతి సాధారణంగా ఓ అటోలో కూర్చుని ఛాయ్ తాగుతూ కనిపించారు. గత కొంతకాలంలో కొడాలి నాని తన స్నేహితుడు రాధాను తన పార్టీలోకి తీసుకు రావాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకుల కధనాలలో తరచుగా వినిపిస్తున్నమాట. కాని వీరిరువురూ ఈ విషయంపై నోరు మెదపరు. మోనం వీడరు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు , శాశ్వత మిత్రులు ఉండరు అన్నది జగమెరిగిన నానుడి. అదే నిజం కాబోతుందెమో. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే గుడివాడ తెలుగుదేశం నాయకులతో వంగవీటి ఇంతలా కలివిడిగా ఉన్న దృశ్యాలు మనకు కనిపించవు. ప్రతిపక్షంపై విరుచుకుపడే కొడాలికి, ఆ ప్రతిపక్షంలో క్రియా శీలకంగా వ్యవహరించే వంగవీటికి మధ్య ఉన్న ఈ అనుబంధం రేపటి రాష్ట్ర రాజకీయాల దిశాదశలను మార్చినా ఆశ్చర్యం లేదు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *