-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి
-కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, అధికారులతో కలిసి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలన్నియు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా సమస్య లకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం – 7, రెవెన్యూ – 2, ఎడ్యుకేషన్ విభాగం – 1 మొత్తం 11 అర్జీలు స్వీకరించుట జరిగింది. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ ఇంజనీర్ యమ.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 6 అర్జీలు…
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో 1 అర్జీ ఇంజనీరింగ్ విభాగం – 1, సర్కిల్ – 2 కార్యాలయంలో 2 అర్జీలు, పబ్లిక్ హెల్త్ విభాగం –1, రెవెన్యూ –1 మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో 3 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 1, పబ్లిక్ హెల్త్ విభాగం –1, రెవెన్యూ –1 వివిధ సమస్యలపై మొత్తం అర్జీలు ప్రజలు అందించుట జరిగిందని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.