విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పి.టి.డి. కి సంబందించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు, I.P.S., ఆధ్వర్యంలో RTC హౌస్ నందు గురువారం సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలు మరియు సమస్యలు గురించి చర్చించారు. కొన్ని ముఖ్య అంశాలు…
-పి.టి.డి ఉద్యోగుల క్యాడర్ ఫిక్సేషన్ మరియు సంబందించిన అంశాలు
-పి.ఆర్. సి 2022 అమలు కు సంబందించిన విషయాలు.
-లీవ్ ENCASHMENT మరియు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులు
-పి. టి. డి ఉద్యోగుల పదోన్నతులకు సంబందించిన అంశాలు
-డ్రైవరు మరియు కండక్టర్ లకు రెస్ట్ రూమ్ లు మరియు ఇతర సదుపాయాల మెరుగుదల
-పి.టి.డి ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు మరియు వైద్య సౌకర్యాలు
-చనిపోయిన మరియు అనారోగ్య కారణాల వల్ల రిటైర్ అయిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు.
-EHS క్రింద మెడికల్ బిల్లుల రీయంబర్స్మెంట్
-డిపో లలో బస్సుల నిర్వహణ మరియు మౌలిక వసతుల మెరుగుదల
-కొత్త జిల్లాల ఏర్పాటు కు సంబందించిన విషయాలు మరియు సిబ్బంది పంపకం
ఈ సమావేశం లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారి అభిప్రాయాలను తెలియజేయగా వారి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో 1 4 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కేంద్ర కార్యాలయం లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.