విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తాడిగడప కు చెందిన పామర్తి శివ నాగరావు కుమార్తెలైన పామర్తి భావన , పామర్తి మేఘన ఇద్దరు అక్క చెళ్లిల్లు కలిసి నిర్మాత గా ఈ సమయం వెళ్ళిపోతుంది అనే 5 సెకండ్స్ నిడివి గల షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. ఈ సందర్భంగా తండ్రి పామర్తి శివనాగరావు మాట్లాడుతూ మనిషి జీవితంలో ఎదురు అయిన కష్టం శాశ్వతంగా ఉండదు దానిని దాటి ముందుకు అడుగు వేస్తే మళ్ళీ సంతోషం ఎదురు అవుతుంది అనే కథకు ప్రాణం పొయ్యటం జరిగిందని తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్ మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది చాలా తక్కువ నిడివి గల షార్ట్ ఫిల్మ్ తీసినందుకు అక్క చెల్లెళ్ళు కు వరల్డ్ రికార్డ్ రావటం చాలా ఆనందంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరో గా చదలవాడ హరికృష్ణ (గృహలక్ష్మి సీరియల్ ఫేం నందు) కోలా అజయ్ నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి డైరెక్టర్ గా గంట్లనా బాలకృష్ణ , నిర్మాతగా భావన, మేఘన నిర్వహించారు. అతి చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో తమదైన ప్రతిభను గణ పరుచుకునేందుకు చేసిన ప్రయత్నం నికి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును నేడు హీరో చదలవాడ హరికృష్ణ, స్కూల్ హెడ్ మాస్టర్ వంగా రామారావు చేతుల మీదగా అందుకున్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …