మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేర స్వామి వారిని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ అర్చకులు జాయింట్ కలెక్టర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సూపర్నెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి వారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కలిదిండి మస్తాన్, ఆర్.ఐ సునీత, వి.ఆర్.ఓ లు మూర్తి, నీలికాంత్, బొడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.