వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం 4కోట్ల 44లక్షల 25 వేళ రూపాయిల విలువైన మంజూరు పత్రాలను ప్రదానం చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్వశ్రేయా నిధుల నుండి పశ్చిమ నియోజకవర్గంలో వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం 4కోట్ల 44లక్షల 25 వేల రూపాయిల విలువైన మంజూరు పత్రాలను శనివారం నాడు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు  ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు పశ్చిమ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సుమారు 20 కోట్లు కేటాయించటం జరిగిందన్నారు.గడిచిన 3 ఏళ్ళ కాలంలో నియోజకవర్గంలో వివిధ దేవాలయాలను అభివృద్ధి పరిచామన్నారు.దుర్గమ్మ దేవస్తానం అభివృద్ధి కోసం 70 కోట్ల రూ..కేటాయించారన్నారు. గత ప్రభుత్వంలో దేవాలయాలను కుల్చేస్తే మా ప్రభుత్వం వాటిని పునర్నిర్మిస్తుందన్నారు. దేవాలయాలను కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని అన్నారు. టి డి పి, జనసేన, బి జె పికలసి గుళ్లను కూల్చారన్నారు. జనసేన నాయకులు దేవాలయాలను కూల్చుతున్నప్పుడు మాట్లాడాకుండా ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. దేవాలయాల అభివృద్ధి కోసం సి.ఎం.జగన్ మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి , చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బాపతి కోటి రెడ్డి, MD రెహమతున్నిసా, శీరంశెట్టి పూర్ణచంద్రరావు, గోదావరి గంగ  మరియు ఆయా దేవస్థానాల ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *