Breaking News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు దుర్మార్గం…

-దళితులను దగా చేస్తారా
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను తుంగలో తొక్కుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. దళితులను దగా చేయడం తప్ప వారి అభ్యున్నతికి ఏమాత్రం కృషి చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితులకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్.సి.డిపార్ట్మెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఎపిసిసి ఎస్.సి. విభాగం రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గంతో పాటు 25 పార్లమెంట్ జిల్లాల చైర్మన్లు, 13 నగర చైర్మన్లకు శైలజనాథ్ నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు పై ఎమ్మెల్యేలు, మంత్రులు తానా తందానా అన్నట్లుగా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం కోసం 9,289 కోట్లు కేటాయింపులు చూపిన సర్కారు 4,188.78 కోట్లు ఖర్చుపెట్టిందని, కేటాయింపుల్లో 54.90 శాతం నిధులను ఖర్చుపెట్టకుండా ఆదాచేసుకుందని ఆరోపించారు. వెనుకబడిన కులాలు, వర్గాల సంక్షేమం కోసం 28,894 కోట్లు కేటాయించినట్లు లెక్కలు చూపి చేసిన ఖర్చు 15,017.38 కోట్లేనని పేర్కొన్నారు. కేటాయించిన నిధుల్లోనే 48.04 శాతం నిధులను సర్కారు ఖర్చుపెట్టకుండా మరో అవసరాలకు ఉపయోగించుకుందని, మైనారిటీ వర్గాల సంక్షేమంకోసం 2,810 కోట్లు కేటాయించినట్లు గొప్పగా ప్రచారం చేశారని, ఖర్చు చేసిన నిధులు 962.18 కోట్లు మాత్రమేనని, ఇందులో 65.74 శాతం నిధులను సర్కారు ఖర్చుపెట్టలేదని
శైలజనాథ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *