Breaking News

డా. వైఎస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి సిద్దం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. వైఎస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 1వ తేదీన డా. వైఎస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నందున చేయవల్సిన ఏర్పాట్ల పై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహిచారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు అందించనున్న 500 డా. వైఎస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక బెంజ్‌సర్కిల్‌ వద్ద నిర్వహించనున్నారన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలను సకాలంలో ఆసుపత్రి నుండి ఇంటికి, ఇంటి నుండి ఆసుపత్రికి
ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డా. వైఎస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందాన్నారు. ప్రారంభోత్సవానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. బెంజ్‌సర్కిల్‌ నుండి మహాత్మాగాంధీ రోడ్డులో ఈ వాహనాలన్నీ వరుస సంఖ్యలో ఉంచాలన్నారు. ప్రతీ వాహనానికి మధ్య ఖాళీ ఉండేలా జిల్లాల వారిగా వాహనాలు ఒకేసారి కదిలేలా చూడాలన్నారు. వాహనాలు బ్రేక్‌డౌన్‌ కాకుండా కండిషన్‌లో ఉండేలా పరిశీలించాలని డిటిసిని కలెక్టర్‌ ఆదేశించారు. డ్రైవర్లు ముందుగానే వాహనాలలో ఉండేలా చూడాలన్నారు. జిల్లాకు కనీసం 40 నుండి 19 వాహనాలు ఉంటాయన్నారు. ప్రారంభోత్సవం అయిన వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లేలా రూట్‌ మ్యాప్‌ సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతీ 5 వాహనాలకు ఒక విఆర్‌వోను, ప్రతీ జిల్లాకు ఒక తహాశీల్థార్‌ను పర్యవేక్షణ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. డ్రైవర్లకు మహాత్మాగాంధీ రోడ్‌ సమీపంలోనే టాయిలెట్లను వినియోగించుకునేలా చూడాలని అలాగే మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ కమీషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.వాహనాలకు కేటాయించబడిన డ్రైవర్లు నేటి రాత్రికి చేరుకునేలా చూడాలన్నారు. వాహనాలలో ఇంధనం, బ్యాటరీలు, కండిషన్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలన్నారు. డ్రైవర్లకు కార్యక్రమంపై ముందుగానే అవగాహన కల్పించాలన్నారు.
బెంజ్‌సర్కిల్‌ వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నందున ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపు ఏర్పాట్లు చేయాలన్నారు. కలకత్తా – చెన్నెయ్‌, మచిలీపట్నం-విజయవాడ, జాతీయ రహదార్లలో ట్రాఫిక్‌ మళ్లింపుపై ముందుగానే తగిన సమాచారాన్ని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగానే అందించాలని డిసిపి హర్షవర్థన్‌ రాజును కలెక్టర్‌ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు డా.కె.మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, నగరపాలక సంస్థ మున్సిపల్‌ కమీషనర్‌ పి రంజిత్‌బాషా, సబ్‌ కలెక్టర్‌ జి సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, డిసిపి హర్షవర్థన్‌రాజు, డిటిసి యం పురేంద్ర, డియంహెచ్‌వో యం సుహసిని, నగరపాలక సంస్థ అడిషనల్‌ కమీషనర్‌ అరుణ, వియంసి ఛీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. జి గీతాబాయి తదితరులు ఉన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్ ఆఫ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *