కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండలాన్ని సంపూ ర్ణ పారిశుద్ధ్య మండలం గా తీర్చిదిద్దుతామని కొవ్వూరు ఎంపిపి కాకర్ల సత్యనారాయణ (నారాయుడు) పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమా వేశం లో ఆయన ముఖ్య అతి ధిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా కాకర్ల నారాయుడు మాట్లా డుతూ, కొవ్వూరు మండలాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య మండలం గా తీర్చిదిద్దే క్రమంలో మండ లంలోని అన్ని గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ కోసం అవసర మైన నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మండలానికి చెందిన బడ్జెట్ నిధులను గ్రామాల వారీగా వి డుదల కు చర్యలు చేపట్టామ న్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో మన గ్రామాల స ర్వతో ముఖాభివృద్ది కోసం కల సి నడుద్దాం అని ఆయన కోరా రు. సమావేశ సందర్భంగా రా నున్న వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరా, ఇతర అంశాలపై స మావేశంలో చర్చించి, సభ్యుల నుంచి సూచనలు స్వీకరించ డం జరిగిందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారి అభివృద్ధి ప్రణాళికలను తెలియజేసారు. ఈ సమావేశంలో వైస్ ఎంపిపివీరమల్ల నారాయుడు, డిడిఓ/ఎంపీడీఓ పి.జగదాంబ, జెడ్. పి. టి. సి, బి. వెంకటలక్ష్మి, మండల తాహిసీల్దార్, బి. నాగ రాజు నాయక్, ఎంపిటిసిలు, స ర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతిని ధులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నా రు.
Tags kovvuru
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …