Breaking News

జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపించే సంసిద్ధులు కండి

-విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదు..
-ప్రతి ఒక్కరూ సమాచారం తో పాటు సమన్వయం తో సమర్ధవంతంగా పనిచెయ్యాలి
-కలెక్టర్ డా.కె. మాధవీలత

రాజమహేంద్రవరం(రూరల్), నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో పరిపాలన యంత్రాంగం సమన్వయం తో సమర్థవంతంగా పనిచేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తూర్పుగోదావరి జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, సోమవారం 4వ తేదీ నుంచే తూర్పుగోదావరి జిల్లాలో పరిపాలన వ్యవస్థ ప్రారంభించడం జరిగిందన్నారు. మీమీ శాఖల కార్యకలాపాలు ప్రారంభించడంలో మరో ఆలోచన కు తావులేదని, రాబోయే సోమవారం నాటికి ప్రతి కార్యాలయం పూర్తి స్థాయిలో విధుల్లో భాగస్వామ్యం కావాల్సిందే అన్నారు. చెప్తాను, చేస్తాను అని మాట రాకుండా కలెక్టర్ ఆలోచన సరళిని అర్ధం చేసుకోని పనిచెయ్యలన్నారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించడంలో ప్రతి ఒక్కరి ఆలోచన సరళి ఒకటే అయిఉండాలని ఆమె తెలిపారు. ఒక చారిత్రాత్మక మైన ఘట్టంలో మీరు కూడా ఒక గుర్తింపు కలిగి ఉంటారన్న విషయం గుర్తించి అంకిత భావంతో పనిచెయ్యలని కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. ఆశావహ దృక్పథం తో కలిసి ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 2వ స్థాయి అధికారులు గా పనిచేస్తున్న మీకు జిల్లా అధికారి హోదా రావడం జరిగిందని, అందుకు అనుగుణంగా భాద్యతలు స్వీకరించి, మీ పనితనాన్ని నిరూపించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కేటాయింపులు జరిగాయని, రాబోయే 24 గంటల్లో ఆయా సిబ్బంది విధుల్లో చేరేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయాల పేర్లు తో కూడిన బోర్డులను, అధికారి, సిబ్బంది పేర్లు తో బోర్డులను శాశ్వత పద్దతిలో ఏర్పాటు చెయ్యాల్సి ఉందన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన కార్యాలయాలను తనిఖీ చేస్తానని, నిర్వహణ కి, పరిశుభ్రత కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళలు కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాల ను అందుబాటులో ఉంచాలని సూచించారు.

ప్రస్తుతం డివిజన్ పరిధిలో పనిచేసే సిబ్బంది 98 శాతం మంది నూతన జిల్లాలో విధులు నిర్వహించేందుకు నియమించడం జరిగిందని కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. హద్దులు మారాయి కానీ భాద్యతలు మరలేదన్న విషయం గుర్తుంచు కోవాల్సి ఉందన్నారు. విధుల్లో, బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించనని, తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. పని విషయంలో ఎటువంటి మినహాయింపూలు ఉండవన్నారు. వివిధ కార్యాలయాలకు సంబంధించిన సిబ్బంది కేటాయింపులు, ఆఫీస్ మెటీరియల్ తరలింపు, పరికరాలు వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. మీ మీ శాఖల ద్వారా మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పంపాల్సి వొస్తే తక్షణమే నివేదిక సమర్పించాలన్నారు. స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి అధికారి తప్పనిసరి గా సమయపాలన పాటించాలని, జిల్లా స్థాయి అధికారే హాజరు కావాల్సి ఉందన్నారు. 19 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, వారే జిల్లా కలెక్టర్ కు మౌత్ పీస్ గా (నోరు చెవులుగా) వ్యవహరించాలన్నారు. సమావేశానికి హాజరుకాని పలువురు అధికారుల వివరణ కోరాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఎస్. మల్లిబాబు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *