Breaking News

టీటీడీ కల్యాణమస్తు జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్లు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కల్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటలకు రెండు గ్రాముల తాళిబొట్లు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. నిజానికి గ్రాము బరువున్న మంగళసూత్రాన్ని ఇవ్వాలని టీడీడీ తొలుత నిర్ణయించినప్పటికీ అంత తక్కువ బరువులో తయారుచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో తాళిబొట్టు బరువును రెండు గ్రాములకు పెంచింది. ఈ ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో ప్రారంభం కానున్న కల్యాణమస్తు కార్యక్రమంలోనే వీటిని పేద జంటలకు ఇవ్వనున్నారు. మరోవైపు, వచ్చే నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే, అద్దె గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *