Breaking News

శివయ్య  కృపకు పాత్రులుకండి…

 

-పుల్లేటి కుర్తి మాధవ రామ కామేశ్వరరావు శర్మ   

నేటి పత్రిక ప్రజావార్త :
ఓం శ్రీ గురు మాత్రే నమః
కాశీ విశాలాక్షీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి యే నమః

భారతీయ సనాతన ఆర్ష హిందూ ధర్మ  పరిరక్షణ సేవలో భాగంగా, పుల్లేటి కుర్తి మాధవ రామ కామేశ్వరరావు శర్మ గత కార్తీకమాసంలో 30 రోజులు మహాదేవుడు  ఆదిదేవుడు బోలా శంకరుడు సదాశివుడు విశ్వేశ్వరుడు కొలువైన కాశీ మహా క్షేత్రంలో భక్తుల గోత్ర నామాలతో అభిషేకం అర్చనలు జరిపించారు. కాశీ మహా క్షేత్రంలో వస్త్ర,అన్న, చెప్పులు,గొడుగు లాంటి వస్తువులు సాధువులకు, పేదవారికి దానం చేయడం కోటి రెట్లు అధికంగా ఫలితం ఇస్తుందని శివ పురాణం లో చెప్ప బడింది. ఆ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అనుగ్రహం తో కార్తీక మాసం నెల రోజులు భక్తుల సహాయం తో 500 మందికి కంబళి,రోజు 200 అన్నదానం జరిపించామని కామేశ్వర రావు శర్మ గారు తెలియచేశారు. అలాగే భక్తుల కోరిక మేరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో నెలకు ఒక జ్యోతిర్లింగ క్షేత్రం చొప్పున 12నెలలకు 12 జ్యోతిర్లింగాల్లో భక్తుల గోత్ర నామాలతో రుద్రాభిషేకం, బిల్వార్చన లు జరిపిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమం పాల్గొను భక్తులు తమ గోత్ర  నామాలను తమ కార్యాలయంలోగాని, 6305665382 ఫోన్ ద్వారాగాని నమోదు చేసుకొనే అవకాశం గురించి తెలిపారు

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *