Breaking News

పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మొదటి సంవత్సరం పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 16,484 మంది , ఓకేషనల్ విద్యార్థులు 1777 మంది పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతం జరిగాయని తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్ ఆర్ కె మహిళా కాలేజీ (03001) ని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఏర్పాట్ల పై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం 17111 మంది, ఒకేషనల్ కోర్సు మొదటి ఏడాది పరీక్షలకు 2046 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.. రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో ఇంటర్ కి 12241 మందికి గాను 11916 మంది హాజరు కాగా 325 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 1222 కి గానీ మందికి గాను 1066 మంది హాజరు కాగా 156 మంది హాజరు కాలేదని తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో 17 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలకి 4870 మందికి గాను 4568 మంది హాజరు కాగా 252 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 824 కి గానీ మందికి గాను 711 మంది హాజరు కాగా 113 మంది హాజరు కాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించవద్దని, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ప్రాంతీయ ఇంటర్మీడియట్అధికారి ఓ జీ జీ కే నూకరాజు తదితరులు ఉన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *