నూతనంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో నూతనంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు తెలియచేశారు. ఈ ఎన్నికల ప్రక్రియకి పరిశీలకునిగా బివి కృష్ణారెడ్డి వ్యవహరించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో తూర్పు గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్వో బి. సుబ్బారావు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. సమాజ సేవ అంటే గుర్తుకు వొచ్చే పేరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని , ఆ సంస్థ పేరు ఇనుమడించేలా జిల్లా శాఖ ఉత్తమమైన సేవలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తూర్పు గోదావరి జిల్లా ఐ ఆర్ ఎస్ శాఖకి అధ్యక్షులుగా వై. మధుసూధన్ రెడ్డి, కార్యదర్శి గా శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా డా. వీ. దాల్ సింగ్, కోశాధికారిగా బి. సాయి సునీల్ లు ఎంపికయ్యారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన టీమ్ జిల్లాలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీ కి సభ్యునిగా జిల్లా నుంచి అధ్యక్షుడు వై. మధుసూధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *