నవరత్నాలు, ధాన్యం కొనుగోలు, పర్యాటక రంగం అభివృద్ది లో చేపట్టవలసిన చర్యలు వేగవంతం చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు, ధాన్యం కొనుగోలు, పర్యాటక రంగం అభివృద్ది లో చేపట్టవలసిన చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ డా.కె.మాధవిలత స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో హౌసింగ్, ధాన్యం కొనుగోలు, రాజమహేంద్రవరం లో చేపడుతున్న అభివృద్ధి పనులు పనుల పురోగతిపై జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ తో కలసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 20926, కొవ్వూరు డివిజన్ పరిధిలో 22914 మందికి ఇల్లు నిర్మించుకునే దిశలో మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు . ఇప్పయివరకు గ్రౌండింగ్ చేసేందుకు ముందుకు రాని లబ్ధిదారులకు అవగాహన కల్పించి ప్రభుత్వం అందజేస్తూ అవకాశాలు అంది పుచ్చుకునేందుకు , తద్వారా త్వరితగతిన నిర్మాణాలను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని లే అవుట్ లలో కోర్టు కేసులు మినహా జిల్లాలో ని అన్ని నియోజకవర్గాలలో జగనన్న కాలనీల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కోసం రాజమండ్రీ డివిజన్ లో 160, కొవ్వూరు డివిజన్ లో 177 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. గ్రేడ్ ఏ రకం రూ.1470, కామన్ వెరైటీ రూ.1455 కి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క గింజను రైతుల నుంచి కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో 210 ఆర్భికే లలో కొనుగోళ్ల ను ప్రారంభించినట్లు, ప్రతి రైతు తాను పండించే పంట అర్భికే లలో అమ్ముకునెలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో 5,89,875 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామని, అర్భికే ల ద్వారా 4.35 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసే అవకాశం ఉందని, జిల్లాలో 4.6p లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 2634 మంది రైతుల నుంచి లక్షా ఎనభై వేల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు. రాజమహేంద్రవరం పరిధిలో ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో రూ. 12 కోట్లతో నిర్మించనున్న క్రికెట్ స్టేడియం, హవ్ లాక్ బ్రిడ్జి అభివృద్ధి, వై జంక్షన్ వద్ద లాండ్ స్క్రాపింగ్ పనులతో సుందరీ కరణ పనులపై సమీక్షించారు. జిల్లాలో ప్రధాన నగరమైన రాజమహేంద్రవరం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని సూచనలు, సలహాలతో ముందుకు రావాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో ప్రస్తుతం మంజూరు కాబడి పురోగతిలో ఉన్న పనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టి ఫలవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఎస్ . మల్లిబాబు, డి ఎం సివిల్ సప్లైస్ టీ. తులసి, హౌసింగ్ అధికారి బి. తారా సింగ్, ఆర్ ఎమ్ సి డి ఇ అర్వీస్ శేషగిరి రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *