Breaking News

మద్దతు ధర విషయంలో మిల్లర్లు రైతులకు మార్గ దర్శకాలు మేరకు చెల్లింపులు జరపాలి…

కొవ్వూరు (కాపవరం), నేటి పత్రిక ప్రజావార్త :
మద్దతు ధర విషయంలో మిల్లర్లు రైతులకు మార్గ దర్శకాలు మేరకు చెల్లింపులు జరపాలని జిల్లా కలెక్టర్ కే. మాధవి లత పేర్కొన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో లే అవుట్, అర్భికే ను తనిఖీ చేశారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించడం దానికి మద్దతు ధర కల్పించడం ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొంతమేర ధాన్యం తడిచిందన్నారు. రైతులు ఆ ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు చేర్చాలని సూచించారు. రైతుల నుంచి ధన్యం కొనుగోలు సమయంలో తేమశాతం విషయంలో మిల్లర్లు సహకరించాలని, అందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చాలని తెలిపారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశ పూర్వకంగా మోసం మద్దతు ధర కంటే తక్కువ చెల్లించి కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లైతే సంబంధించిన మిల్లర్లు పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంకి సంబంధించిన చెల్లింపులు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అన్ని. విధాలుగా ఇంటి నిర్మాణాలకు కావలసిన సిమెంట్, ఇసుక, కంకర అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కాపవరం లో 233 లే అవుట్ లలో 218 మందికి ఇంటి నిర్మాణం కోసం మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇందులో 199 మందికి ప్రభుత్వ లే అవుట్ లు, మరో 19 మంది స్వంత స్థల యజమానులు ఉన్నారన్నారు. ఏడు ఇంటి నిర్మాణాలు పూర్తి అవ్వగా, మిగిలిన వీటిలో 137 బిబిఎల్, 47 బీఏల్, 16 రూఫ్ లెవెల్, 15 రూఫ్ కంప్లీట్ అయ్యాయని తెలిపారు. ఈ లే అవుట్ లో ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు రు.42,41,600 లు విడుదలైన ట్లు తెలిపారు. లబ్దిదారులు ఎంత త్వరగా ఇంటి నిర్మాణాలు చేపడితే ఆయా నిర్మాణాల స్థాయికి అనుగుణంగా లబ్దిదారుల ఖాతాకు నిధులు జమ చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, తదితరులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *